యంగ్ హీరోస్ కొత్త సినిమాల అప్ డేట్స్            

News

యంగ్ హీరోస్ కొత్త సినిమాల అప్ డేట్స్            

14 May, 2019
telugu-young-heroes-new-movies-updates

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో యువ క‌థానాయ‌కులు అంటే నాని, నితిన్, నాగ‌చైత‌న్య‌, శ‌ర్వానంద్, వ‌రుణ్ తేజ్, సుధీర్ బాబు, రానా, నాగ‌శౌర్య‌, బెల్లంకొండ శ్రీనివాస్, కార్తికేయ‌, శ్రీ విష్ణుల పేర్లు చెప్ప‌వ‌చ్చు. టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమాకు మించి న‌టించ‌డం లేదు. ఇక సీనియ‌ర్ డైరెక్ట‌ర్, యంగ్ డైరెక్ట‌ర్స్ యంగ్ హీరోస్ తో సినిమాలు చేయ‌డానికి ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. ఇక యంగ్ హీరోస్ ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తూ వ‌స్తున్నారు.

ఇటీవ‌ల విడుద‌లైన నాని జెర్సీ మూవీ ఘ‌న‌విజ‌యం సాధించింది. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో గ్యాంగ్ లీడ‌ర్,

మోహ‌న్ కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో V మూవీలో నాని న‌టిస్తున్నారు. మ‌రికొన్ని క‌థ‌ల‌ను కూడా నాని ఒకే చేశార‌ని

స‌మాచారం. వెంకీ కుడుముల భీష్మ‌, చంద్ర శేఖ‌ర్ యేలేటి, కృష్ణ చైత‌న్య సినిమాలు చేస్తున్న‌ట్టుగా హీరో నితిన్ ప్ర‌క‌టించారు. నాగ‌చైత‌న్య న‌టంచిన మ‌జిలీ మూవీ ఘ‌న‌విజ‌యం సాధించింది. వెంకీ మామ మూవీని ఒకే చేసిన విష‌యం తెలిసిందే. ద‌ర్శ‌కులు అజ‌య్ భూప‌తి, త్రినాథ రావు న‌క్కిన‌, మేర్ల‌పాక గాంధీ, దిల్ రాజు బ్యాన‌ర్ లో ఒక కొత్త 

ద‌ర్శ‌కుడు నాగ‌చైత‌న్యకు స్టోరి రెడీ చేస్తున్నాడు.

యువ సంచ‌ల‌నం హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన డియ‌ర్ కామ్రేడ్ త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక మూవీ , రెండు ద్వి భాషా చిత్రాల‌కు ఓకే  చేసిన‌ట్టు స‌మాచారం. రానా ద‌గ్గుబాటి గుణ‌శేఖ‌ర్ హిరణ్య 

క‌శ‌ప , వేణు ఊడుగుల విరాట‌ప‌ర్వం 1992 మూవీస్ లో న‌టించ‌నున్నారు. ఇద్ద‌రు యువ ద‌ర్శ‌కులు రానాకు క‌థ‌లు సిద్దం చేస్తున్నారు. వాల్మీకి మూవీలో న‌టిస్తున్న వ‌రుణ్ తేజ్ బాక్సింగ్ నేప‌థ్యం ఉన్న మూవీలో న‌టించ‌నున్నారు.

సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఒక మూవీ , త‌మిళ మూవీ 96 రీమేక్ మూవీ షూటింగ్స్ తో శ‌ర్వానంద్ బిజీగా ఉన్నారు. 

సుధీర్ బాబు V సినిమాతో పాటు పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్ మూవీలో న‌టించ‌నున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కార్తికేయ‌, సందీప్ కిష‌న్ కూడా రెండు, మూడు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

Write Comment